calender_icon.png 23 May, 2025 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌ను ప్రపంచనగరంగా తీర్చిదిద్దుతాం!

23-05-2025 12:09:17 AM

ఎన్ని నిధులైనా ఖర్చుపెట్టేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారు

సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచనగరంగా తీర్చిదిద్దడానికి ఎన్ని నిధులైన ఖర్చు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చెప్పారు. గురువారం రాష్ర్ట సచివాలయంలో పాతనగరం అభివృద్ధి పురోగతి పనులు, అభివృ ద్ధిపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మా ట్లాడుతూ..

హైదరాబాద్ పాత నగరంలో వారసత్వ నిర్మాణాలను కాపాడుకుంటూ అభివృద్ధి చేసుకుందామన్నారు. నగర అభివృద్ధికి గత బడ్జెట్లో రూ.౧౦వేల కోట్లు కేటాయించామన్నారు. మూసీ పునర్జీ వం, మెట్రో రైల్ విస్తరణ, పర్యాటక ప్రాం తాల అభివృద్ధి, విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వచ్చే ఐదేండ్ల పాటు నగరవాసులకు సరిపోను మంచినీటిని సరఫరా చేయడానికి రూ.7,400 కోట్లతో 20 టీఎంసీల గోదావరి నీళ్లను తీసుకురానున్నామని చెప్పారు. 

నగరంలో మెట్రో రైల్ విస్తరణ..

2,714 కోట్ల రూపాయలతో ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ విస్తరణకు సంబం ధించిన ప్రతిపాదనలు కేంద్రప్రభుత్వానికి పంపించామని డిప్యూటీ సీఎం భట్టి అన్నా రు.

మెట్రో రైల్ ఏర్పాటు కోసం రోడ్డు విస్తరణ పనులు పాత నగరంలో శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. రూ.19,579 కోట్లతో జేబీఎస్ నుంచి మేడ్చల్, జేబీఎస్ నుంచి షామీర్‌పేట్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైల్ విస్తరణకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపా మన్నారు.. 

అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు

ఓల్డ్ సిటీ అగ్ని ప్రమాదం జరిగి ఇటీవల 17 మంది చనిపోవడం చాలా బాధాకరమని భట్టివిక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదాల నివారణకు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కమిటీ వేశారని, ఆ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటామన్నారు.