పురావస్తుశాఖ ఆస్తులను సంరక్షించాలి

27-04-2024 02:30:15 AM

ప్రిన్స్‌పాల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ 

నూర్ ఇంటర్నేషనల్ మెక్రోఫిల్మ్ సెంటర్, న్యూఢిల్లీతో పురావస్తుశాఖ ఎంవోయూ

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 26 (విజయక్రాంతి):  తెలంగాణ మ్యూజియంలలో వెలకట్టలేని జాతి సంపద ఉందని వాటిని సంరక్షించే బాధ్యత మనందరిపై ఉందని యువజన సేవలు, పర్యాటకం అండ్ సాంస్కృతిక శాఖ ప్రిన్స్‌పాల్ సెక్రటరి శైలజా రామయ్యర్ అన్నారు. గురువారం రాష్ట్ర పురావస్తు శాఖ, నూర్ ఇంటర్నేషనల్ మైక్రోఫిల్మ్ సెంటర్ న్యూఢిల్లీ మధ్య శైలజా రామయ్యర్ సమక్షంలో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని భగవాన్ మహావీర్ ఆడిటోరి యంలో ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతిసందపను కాపాడి, భవిష్యత్ తరాలకు అందించేందుకు ముందుకు వచ్చిన నూర్ ఇంటర్నేషనల్ మైక్రోఫిల్మ్ సెంటర్, న్యూఢిల్లీ వారిని ప్రత్యేకంగా అభినందించారు.

అనంతరం పురావ స్తుశాఖ డైరెక్టర్ భారతీ హోళికేరి మాట్లాడుతూ జాతి సందపను భావితరాలకు అందించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ పురావస్తుశాఖ డైరెక్టర్ హోళికేరి, నూర్ ఇంటర్నేషనల్ మైక్రోఫిల్మ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ మెహదీ ఖాజాపేరిల మధ్య అవగాహన ఒప్పంద పత్రాలపై ఇరువురు సంతకాలు చేసి పత్రాలను మార్చు కున్నారు. నూర్ ఇంటర్నేషనల్  మైక్రోఫిల్మ్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ సాహెబ్ ఖాజాపేరి, దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ డైరెక్టర్ నూర్‌మహ్మద్‌తో పాటు తెలంగాణ పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పి.నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. 

హెర్బల్ టెక్నాలజీ ప్రత్యేకం

నూర్ ఇంటర్నేషనల్ మెక్రోఫిల్మ్ సెంటర్ దస్తావేజులను డాక్యూమెంటేజైషన్ చేయడంలో వంద సంవత్సరాల అనుభవం ఉం ది. ఇది ఇస్లామిక్ రాయబార కార్యాలయం. న్యూఢిల్లీలో అనేక అంతర్జాతీయ, జాతీయ దస్తావేజుల సంస్థలతో కలిపి పనిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని పురావస్తుశాఖకు చెందిన సంపదను మరమ్మతులు, పరిరక్షణ, డిజిటలైజేషన్, డాక్యూమెంటేషన్, కాటలాగింగ్, పెయింటింగ్స్, దస్తావేజులు తెలంగాణ రాష్ట్ర మ్యూజియంలో భద్రపర్చబడి ఉన్నాయి. వీటన్నింటిని ఆధునికీకరణ పద్ధతిలో మరమ్మతులు చేసి భవిష్యత్ తరాలకు అందించేందుకు ఈ సంస్థ దోహదం చేస్తోందని పురావస్తుశాఖ డైరెక్టర్ భారతీ హోళికేరీ తెలిపారు.