calender_icon.png 31 July, 2025 | 6:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త జూనియర్ కాలేజీల్లో పోస్టులేవీ?

31-07-2025 12:36:46 AM

  1. నూతనంగా 18 జూనియర్ కాలేజీలు ఏర్పాటు 
  2. వాటికి ఇంకా మంజూరుకాని పోస్టులు
  3. 311 పోస్టులు మంజూరు చేయాలి 
  4. ప్రభుత్వానికి ఇంటర్ విద్యాశాఖ ప్రతిపాదనలు 
  5. అనుమతులివ్వడంలేదని ఆర్థికశాఖపై విమర్శలు

హైదరాబాద్, జూలై 30 (విజయక్రాం తి): రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన ప్రభు త్వ జూనియర్ కాలేజీల్లో పోస్టులు మంజూ రు జాప్యం జరుగుతోంది. ఇంటర్మీడియట్ విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింనప్పటికీ క్లియరెన్స్ ఇచ్చేందుకు ఆర్థిక శాఖ మోకాలడ్డుతోందనే వివర్శలు వినిపిస్తున్నాయి. 2023 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 18 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కొత్తగా ఏర్పాటయ్యాయి.

గతేడాదిలోనే ఏకంగా ఎనిమిది కొత్త కాలేజీలు వచ్చాయి. ఈ కాలేజీల్లో మొత్తం 311 పోస్టులు మంజూ రు చేయాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు విద్యాశాఖ కార్యదర్శికి ప్రతిపాదనలు ఇప్పటికే పంపించారు. వీరు ప్రభు త్వానికి పంపగా అన్ని పోస్టుల మంజూరుకు ఆర్థికశాఖ అనుమతి లభించేలేదని తెలిసింది. 

157 పోస్టులకే అనుమతులిస్తాం...

311 పోస్టులను సాంక్షన్ చేయకుండా అందులో 157 పోస్టులకు మాత్రమే అనుమతులిస్తామని ఆర్థిక శాఖ చెప్పినట్లు సమా చారం. 311 పోస్టుల్లో ప్రిన్సిపాల్ జూనియర్ లెక్చరర్స్ ఫిజికల్ డైరెక్టర్ లైబ్రేరియన్స్ సీనియర్ అసిస్టెంట్స్ పోస్టులున్నాయి. ఈ అన్ని పోస్టులను సాం క్షన్ చేస్తే ప్రభుత్వంపై ఆర్థికభారం పడుతుందని, అందుకే తొలుత 157 పోస్టులను మాత్రమే మంజూరు చేస్తామని అధికారుల తో ఆర్థికశాఖ తేల్చిచెప్పినట్లుగా సమాచా రం.

విద్యాసంవత్సరం ప్రారంభమైనా దీనిపై ఓ నిర్ణయం తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ ఫైల్ గత క్యాబినెట్ ముం దుకు కూడా చేరింది. ప్రభుత్వంపై ఆర్థికభా రం పడుతుందనే కారణంతో ఈ పోస్టులను పక్కకు పెట్టడం సరికాదని ఇంటర్ అధ్యాపకవర్గాలు  పేర్కొంటున్నాయి.

కొత్త పోస్టులు మంజూరు కాకపోవడంతో ఇతర కాలేజీల అధ్యాపకులను తాత్కాలికంగా డిప్యూటేషన్‌పై పంపించి మమ అనిపిస్తున్నట్లు విమ ర్శలు వినిపిస్తున్నాయి. కనీసం 18 మంది ప్రిన్సిపల్ పోస్టులకు క్లియరెన్స్ ఇచ్చి బోధన కోసం గెస్ట్, ఔట్‌సోర్సింగ్ అధ్యాపకులను నియమించుకున్నా సరిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.