calender_icon.png 12 May, 2025 | 7:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లారీ, కారు ఢీకొని తండ్రి, కుమార్తె దుర్మరణం

11-05-2025 10:33:22 AM

హైదరాబాద్: నిర్మల్ జిల్లా(Nirmal District)లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. నీలాయిపేట గ్రామ సమీపంలోని జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన లారీ-కారు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో తండ్రి, కుమార్తె అక్కడికక్కడే మృతిచెందగా, మరొక వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో వారి కారు డ్రైవర్ రెండు కాళ్ల విరిగిపోయాయి. క్షతగాత్రులను తక్షణమే చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులను ఆదిలాబాద్ లోని రవీంద్రనగర్ కు చెందిన శంకర్, కృతికగా గుర్తించారు.

ప్రమాదం జరిగిన సమయంలో వారు హైదరాబాద్ నుండి ఆదిలాబాద్‌(Hyderabad to Adilabad)కు వెళుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తెలినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదం తర్వాత వ్యాన్ డ్రైవర్ పరారీలో ఉన్నాడని ప్రస్తుతం అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.