03-05-2025 12:52:01 AM
కిషన్‌రెడ్డికి జగ్గారెడ్డి సవాల్
హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణనపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చర్చకు సిద్ధమా? అని పీసీ సీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సవాల్ విసిరారు. కుల గణనపై అసెంబ్లీలో జరిగిన చర్చ కు మద్దతిచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలపైన కూడా అనుమానం ఉందా అని కిషన్‌రెడ్డిని నిలదీశారు.
శుక్రవారం గాంధీభవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కుల గణన సర్వే జరిన సమయంలో కిషన్‌రెడ్డి తెలంగాణలో లేనందునే అవగాహన లేదని, అందుకే విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు.