calender_icon.png 3 May, 2025 | 1:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశానికే ఆదర్శంగా నిలిచిన సీఎం రేవంత్‌రెడ్డి

03-05-2025 12:46:04 AM

తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాల్ రాజ్ గౌడ్

ముషీరాబాద్, మే 2 (విజయక్రాంతి) : బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలుకు కులగణన ప్రక్రియ అసెంబ్లీలో తీర్మానంచేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపి పార్లమెంట్ లో చట్టం చేయాలని చిత్తశుద్ధితో కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకీ తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ సీఎం రేవంత్ రెడ్డిని కలసి కృతజ్ఞతలు తెలిపింది.

ఈ సందర్బంగా కమిటీ చైర్మన్ బాలగోని బాల్ రాజ్ గౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ యెలికట్టె విజయ్ కుమార్ గౌడ్, బీసీ సమైక్య అధ్యక్షులు దుర్గయ్య గౌడ్, బీసీ జనసైన్యం అధ్యక్షలు సింగం నాగేష్ గౌడ్ మాట్లాడుతూ దశాబ్దాల పోరాట ఫలితమే నేడు కేంద్ర ప్రభుత్వం జన గణనలో భాగంగా కుల గణన ప్రక్రియ అని, ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదములు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పోరాటం వల్ల కులాల లెక్కలు తీయడం అది రిజర్వేషన్లు పొందే అవకాశం యావత్తు భారత దేశంలోని అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నట్లు చెప్పడం హర్షణీయం అన్నారు. దేశంలో ఉన్న అణగారిన వర్గాలు, కులాలు వెనుకబడిన ప్రజల జనాభా, వారి వాటా పొందడం లో ఈ ప్రక్రియ దోహద పడుతుందని అన్నారు.

మేమెంతో మాకంత వాటా, అన్ని రంగాల్లో మా కోటా పొందాల్సిన అవసరం ఉందని, అప్పుడే నిజమైన సామాజిక న్యా యం జరుగుతుందన్నారు. గ్రామ స్వరాజ్య మే ఈ దేశ స్వరాజ్యం అని స్వతంత్ర పోరా టం పిలుపులో భాగంగా నేడు అణగారిన వర్గాల అభివృద్ధినే ఈ దేశ అభివృద్ధి చెందడానికి, సమ న్యాయం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కులాలవారిగ లెక్కలు 6 మసాలలోపు తీసి 50 శాతం రిజర్వేషన్ సీలింగ్ ను ఎత్తివేసి పారదర్శకంగా విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక రంగాలలో వాటా కల్పిస్తూ ముందడుగు వేయాలని కోరారు.