calender_icon.png 3 May, 2025 | 1:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దోస్త్ నోటిఫికేషన్ విడుదల

03-05-2025 12:54:30 AM

  1. మూడు దశల్లో ప్రవేశాలు

నేటి నుంచి మొదటిదశ అడ్మిషన్లు ప్రారంభం

జూన్ 30 నుంచి తరగతులు.. 

హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఉద్ధేశించిన దోస్త్ నోటిఫికేషన్‌ను శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ బాల కిష్టారెడ్డి విడుదల చేశారు. 3 దశల్లో డిగ్రీలో ప్రవేశాలకు అవకాశం కల్పించనున్నారు. మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బాలకిష్టారెడ్డి నోటిఫికేషన్ వివరాలను వెల్లడించారు. 

మొదటి దశలో అడ్మిషన్ల ప్రక్రియ శనివారంచి ప్రారంభమవుతుంది. మే 3 నుంచి 21 వరకు దరఖాస్తులు స్వీకరించి, మే 10 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వనున్నట్టు వివరించారు. మే 29న తొలివిడత సీట్ల కేటాయింపును కేటాయించను న్నారు. రెండో దశ మే 30 నుంచి జూన్ 13 వరకు, మూడో దశ జూన్ 13 నుంచి జూన్ 23 వరకు ఉంటుంది.

మూడు దశల్లో సీట్లు సాధించిన విద్యార్థులు జూన్ 24 నుంచి జూన్ 28లోపు వారికి సీటు వచ్చిన కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. జూన్ 30 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. దోస్త్ వెబ్‌సైట్ dost. cgg.gov.in ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ సాగుతుంది. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాత వాహన, జేఎన్‌టీయూ, వీరనారి చాకలి ఐల మ్మ విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలల్లో దోస్త్ ద్వారా అడ్మిషన్లు లభిస్తాయి. 

మొదటిదశ 

మే 3 నుంచి మే 21 వరకు దరఖాస్తులు

మే 10 నుంచి 21 వరకు వెబ్‌ఆప్షన్లు

మే 29న తొలి విడత సీట్ల కేటాయింపు

రెండోదశ 

మే 30 నుంచి జూన్ 8 వరకు దరఖాస్తులు

మే 30 నుంచి జూన్ 9 వరకు వెబ్‌ఆప్షన్లు

జూన్ 13 న రెండోదశ సీట్ల కేటాయింపు

మూడోదశ

జూన్ 13 నుంచి 19 వరకు దరఖాస్తులు

జూన్ 13 నుంచి జూన్19 వరకు వెబ్‌ఆప్షన్లు

జూన్ 23న మూడోదశ సీట్ల కేటాయింపు