22-05-2025 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే21( విజయక్రాంతి): జిల్లా కేంద్రం నుండి ఆదిలాబాద్ క్రాస్ రోడ్ వరకు రోడ్డుపై ఏర్పడ్డ గుంతలను పుడ్చాలని మంగళవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భం గా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దుర్గం దినకర్ మాట్లాడుతూ రహదారిపై పెద్ద పెద్ద గుంతలుఏర్పడడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
గుంతల్లో మురికి నీరు చేరి కాలినడకన వెళుతున్న ప్రజలపై మురుగునీరు పడుతుంద న్నారు. రోడ్డు గుండా అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు ప్రయాణం చేస్తున్నప్పటికీ గుంతలు కనపడలేదా అని ప్రశ్నిం చారు. రాస్తారోకో చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న సీఐ రవీందర్, ఎస్సై ప్రశాంత్ అక్కడికి చేరుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి గుంతలు పూడ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాస్తారోకోను వినింపజేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్ నార్ రమే ష్, సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు రాజేందర్, టీకానంద్, మాల శ్రీ నాయకులు కార్తీక్, తిరుపతి, నిఖిల్,శ్రావణి పాల్గొన్నారు.