calender_icon.png 13 May, 2025 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు బైక్ లు ఢీకొని వ్యక్తి దుర్మరణం, ఒకరికి గాయాలు

13-05-2025 07:33:04 PM

కడ్తాల్: రెండు బైక్ లు ఢీకొని ఒకరు దుర్మరణం చెందగా మరొకరు తీవ్ర గాయాలైన సంఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. మంగళవారం సీఐ గంగాధర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గానుగుమర్ల తండాకు చెందిన మునావత్ సోమ్లా నాయక్(38) పల్సర్ బైక్ పై తండా నుంచి కడ్తాల్ వస్తుండగా మల్లప్ప ఫోల్ట్రీఫామ్ వద్ద కడ్తాల్ నుంచి గానుగుమర్ల తండాకు మరో వ్యక్తి పల్సర్ బైక్ పై వెళుతుండగా రెండు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సోమ్లా నాయక్ తీవ్ర గాయాలు కాగా 108లో మహేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమ్లా నాయక్ మృతి చెందాడు. మరో బైక్ అతను గాయాలయ్యాయి. మృతుని తమ్ముడు పాండు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.