calender_icon.png 13 May, 2025 | 12:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమ్మెను జయప్రదం చేయాలి

09-05-2025 12:40:02 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే8 (విజయక్రాంతి): ఈనెల 20న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ పిలుపునిచ్చారు. గురువారం రెబ్బెన పిహెచ్సి వైద్యాధికారి సుజిత్ సమ్మె నోటీసును అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దుచేసి 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ ద్వారా వేతనాలు చెల్లించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్‌ఎం జిల్లా జాయింట్ సెక్రెటరీ ప్రమీల, తులసి ,వనిత ,స్వామి తదితరులు పాల్గొన్నారు.