13-05-2025 06:52:25 PM
ఇందిరమ్మ ఇండ్లు నిజమైన లబ్ధిదారులకు అందాలి..
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్..
మునుగోడు (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను కార్యకర్తలు గ్రామాలలో పార్టీ చేసిన సేవలు, పార్టీ సిద్ధాంతాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్(MLC Shankar Naik) అన్నారు. నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మునుగోడు, చండూరు, నాంపల్లి, మర్రిగూడ, ఘట్టుప్పల్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై పార్టీ అబ్జర్వర్ నాసిర్ అహ్మద్ తో కలిసి మాట్లాడారు. సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి అర్హులకు అందేలా చూడాలని అన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు నిరుపేదలకు అందేలా చూసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. పార్టీ ఆదేశాల మేరకు త్వరలో నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామశాఖ కమిటీ, మండల కాంగ్రెస్ కమిటీ, యువజన కాంగ్రెస్, అనుబంధ సంఘాల నూతన కమిటీలు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జీవనపల్లి సైదులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, బూడిద లింగయ్య, జాలా వెంకటేశ్వర్లు, భాస్కర్, పలువురు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు ఉన్నారు.