13-05-2025 06:39:02 PM
మునుగోడు (విజయక్రాంతి): తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(Telangana Union of Working Journalists) 143 నల్గొండ జిల్లా అధ్యక్షులు గుండెగోనీ జయశంకర్ గౌడ్ ఆదేశాల మేరకు మంగళవారం మునుగోడు మండల కేంద్రంలో మండల అధ్యక్షులు జీడిమడ్ల బాబు, ప్రధాన కార్యదర్శి నెల్లికంటి శంకర్ ఆధ్వర్యంలో పూర్తి మండల కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేశారు. ఉపాధ్యక్షులుగా దుబ్బ విజయభాస్కర్‌ను, కార్యదర్శిగా రెడ్డి మల్ల వెంకటేష్‌ను, కోశాధికారిగా జిట్టగోని వెంకటేష్‌ను నియమించారు.
అదేవిధంగా బేరి రవీందర్, దుబ్బ అనిల్, ఐయితరాజు సత్యంలను కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు జిల్లా అధ్యక్షులు గుండెగోనీ జయశంకర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గాలంక గురుపాదం, జిల్లా ఉపాధ్యక్షులు పోలగొని లక్ష్మీకాంత్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోడి రాములు తమ నియామకానికి సహకరించినందున ధన్యవాదాలు తెలుపుతూ సంఘం బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు.