calender_icon.png 14 May, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెనుకబడిన మునుగోడు ప్రాంతానికి కరెంటు సమస్య లేకుండా చూడాలి...

13-05-2025 06:33:16 PM

విద్యుత్ పనుల అభివృద్ధి కోసం 34 కోట్ల రూపాయలు మంజూరు చేయండి..

నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని అభివృద్ధి చేయండి..

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి..

మునుగోడు (విజయక్రాంతి): వెనుకబడిన మునుగోడు నియోజకవర్గ ప్రాంతానికి కరెంట్ సమస్యను లేకుండా చూడాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) అన్నారు. కరెంటు సమస్యలు విద్యుత్ పనుల అభివృద్ధిపై ముఖ్య నాయకులతో కలిసి హైదరాబాదులోని టీజీ ఎస్పీడీసీఎల్(TGSPDCL) రాష్ట్ర కార్యాలయంలో సిఎండి ముషారఫ్ తో కలిసి సమీక్ష సమావేశం మాట్లాడారు. లో వోల్టేజి సమస్య, అదనపు ట్రాన్స్ఫార్మర్ల కేటాయింపు, అదనపు సబ్ స్టేషన్ ల నిర్మాణం, లూజు లైన్ల సమస్యలు, గృహాలు ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలల పైన ప్రమాదకరంగా ఉన్న కరెంటు వైర్లు తొలగింపు సమస్యలతో పాటు మరికొన్ని సమస్యలను సీఎండి ముషారఫ్, యాదాద్రి నల్గొండ జిల్లాలకు సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను సావధానంగా విన్న సీఎండి ముషారఫ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అక్కడే ఉన్న యాదాద్రి నల్గొండ జిల్లాల విద్యుత్ అధికారులను ఆదేశించారు.

నాణ్యమైన, భద్రతతో కూడిన కరెంటు ఇచ్చే విధంగా రాబోయే కాలంలో ప్రజా ప్రభుత్వం విద్యుత్ శాఖలో సమూలమైన సంస్కరణలు తీసుకొస్తుందని, ఆ సంస్కరణలు మొదట మునుగోడు నియోజకవర్గం నుండి మొదలుపెట్టాలని, నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని విద్యుత్ అభివృద్ధి పనులు చేయాలని సీఎండి ముషారఫ్ కోరారు. కరెంటు సమస్యలు పరిష్కరించడానికి 34 కోట్ల రూపాయల అవసరమవుతున్నాయని, ప్రత్యేక దృష్టితో 34 కోట్ల రూపాయల పనులను మంజూరు చేయాలని ముఖ్య నాయకులతో కలిసి సీఎండి ముషారఫ్ కి వినతిపత్రం అందజేశారు.

విద్యుత్ శాఖలో పనిచేసే అధికారులు విధుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వేధించి ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్న విషయాలు నా దృష్టికి వచ్చాయని దీనివల్ల ప్రజాప్రతినిధులుగా మాకు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోని స్ట్రీమ్ లైన్ చేయాలని సీఎండి ముషారఫ్ కోరారు. ప్రత్యేక దృష్టి ఉంటుందని, వ్యవసాయ పొలాల మధ్యన ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ వెంటనే  మార్పిస్తామని, ట్రాన్స్‌ఫార్మర్ల ఎత్తు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అగ్రికల్చర్ డిపిఆర్లకు ఏబి స్విచ్లు మొత్తం పెంచుతామని, మే నుండి జూన్ మధ్యలో ఏబీ స్విచ్లు మొత్తం రిపేర్ చేయాలని అక్కడే ఉన్న అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో నల్గొండ యాదాద్రి జిల్లాల విద్యుత్ అధికారులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు ఉన్నారు.