27-07-2025 01:37:11 AM
కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి, మంత్రులు, నాయకులు, ఐఎఎస్‌లు, పోలీసులు ఎవర్ని వదలకుండా కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కు మార్‌రెడ్డి మండిపడ్డారు. పోలీసులు, అధికారులపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడతుంటే తెలంగాణ ప్రజలు తలవంచుకునేలా ఉందన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్ల పాటు పనిచేసింది ఇదే పోలీసులు అన్న విషయాన్ని మరిచిపోతున్నారని ఆయన మండిపడ్డారు.
శనివారం కంభం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తమ హయాంలో పోలీసులు, అధికారులను మెచ్చుకున్న కేటీఆర్, ఇప్పుడు దూషిం చడమేంటన్నారు. అసెంబ్లీలో చిత్తుగా ఓడిపోయినా? పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ ఎస్‌ను జీరో చేసినా.. అవినీతి డబ్బుతో కేటీఆర్‌కు అహంకారం మరింత పెరిగింద న్నారు. కుటుంబంలో గొడవలతో కేటీఆర్ అసహనంలో ఉన్నాడని, ఒకవైపు చెల్లె, మరో వైపు బావ హరీశ్‌రావు చికాకు పెడుతున్నారని ఆయన తెలిపారు.