13 March, 2026 | 4:17 AM

పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం

13-03-2026 12:08 AM
  1. 14 నుంచి పరీక్షలు 

విద్యార్థులు  పరీక్ష కేంద్రాలకు గంట ముందుగా చేరుకోవాలి

కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి, మార్చి 12 (విజయక్రాంతి): పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ తెలిపారు. ఈనెల 14న గురువారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం అవుతాయని తెలిపారు. జిల్లాలో 65 పరీక్ష కేంద్రాల్లో 13,154 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. పరీక్షలకు డిపార్ట్మెంట్ అధికారులు చీప్ సూపరిండెంట్లు 65 మంది, ఎనీ విధి లేటర్లు 739, పరీక్ష సమయం ఉదయం 9:30 నుంచి 12:30 వరకు విద్యార్థులకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే హాజరు కావాలన్నారు.

అధికారిక వ్బుసైట్ నుంచి హాల్ టికెట్లను విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రానికి హాల్ టికెట్ రైటింగ్ ప్యాడ్ పెన్నులు పెన్సిల్లు మాత్రమే తీసుకెళ్లాలన్నారు. నిషేధిత వస్తువులైన సెల్ ఫోన్లు ఈగలరు. క్యాలిక్యులేటర్ ఎలక్ట్రానిక్ వస్తువులు పాఠ్యపుస్తకాలు ప్రింటెడ్ మెటీరియల్స్ నకల్ నేరుగా పరీక్ష కేంద్రానికి అనుమతించరన్నారు. విద్యార్థులు పరీక్ష సమయంలో కేంద్రం నుంచి బయటకు వెళ్లకూడదన్నారు. పరీక్ష సమాధానం పత్రం పూర్తయినప్పటికీ కేటాయించిన సమయం మూసే వరకు పరీక్ష కేంద్రంలోని విద్యార్థులు ఉండాలన్నారు.

హాల్ టికెట్ ఓఎంఆర్ షీట్లో ఏదైనా తప్పులుంటే న్యూ లెటర్ లేదా చీప్ సూపర్డెంట్ కు వెంటనే తెలియజేయాలన్నారు. 24 గంటల పాటు విద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రూమ్ నెంబర్ 9959670118 కు కాల్ చేసి అనుమానా లను నివృత్తి చేసుకోవాలన్నారు. పదవ తరగతి విద్యార్థులకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పదో తరగతి బోధించే ఉపాధ్యాయులు విద్యార్థులకు దిశ ,నిర్దేశం చేసి పరీక్షలకు సన్నద్ధం చేయాలన్నారు. మాస్ కాపీంగుకు అవకాశం లేకుండా ఏర్పాట్లు చేసినట్లు  తెలిపారు.