05-12-2025 08:16:12 PM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): ఈనెల 11న జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయని జాజిరెడ్డిగూడెం మండల ఎన్నికల అధికారి,ఎంపీడీఓ పి ఝాన్సీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో 17 గ్రామ సర్పంచ్లు,152 వార్డులకు ఎన్నికలు జరగనుండగా అధికారులు152 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
మండలంలో 24,615 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని,ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పేపర్లతో పాటు మొత్తం ఎన్నికల సామాగ్రి మండల పరిషత్ కార్యాలయానికి చేరిందని,ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అధికారులకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.