calender_icon.png 5 December, 2025 | 8:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆసుపత్రిలో అవినీతికి పాల్పడిన అధికారులను సస్పెండ్ చేయాలి

05-12-2025 07:50:47 PM

ఏఐఎఫ్బి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్

ముకరంపుర,(విజయక్రాంతి): జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో జరిగిన 4.50 కోట్ల అవినీతిపై విచారణ జరిగి 20 రోజులు అవుతున్నా కారకులైన వైద్యులను ఎలాంటి చర్యలు తీసుకోలేదని, వెంటనే అవినీతి అధికారులను సస్పెండ్ చేయాలని ఏఐఎఫ్ బీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ కోరారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లకు బహిరంగ లేఖ విడుదల చేశారు. వెంటనే ఎంక్వైరీ రిపోర్టు బహిర్గతపర్చాలని, అవినీతి అధికారులు, వైద్యులను సస్పెండ్ చేయాలని, నిధులను ఠికవరీ చేయాలని డిమాండ్ చేశారు.