25 February, 2026 | 4:37 PM

ఇంటర్ పరీక్షలు ఏర్పాట్లు పూర్తి

25-02-2026 12:00 AM

మంచిర్యాల, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 25 నుంచి మార్చి 16 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రథమ సంవత్సరంలో జనరల్ 5,372 మంది, ఒకేషనల్ 888 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో జనరల్ 5,227 మంది, ఒకేషనల్ 830 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు.

పరీక్షల నిర్వహణలో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు తో పాటు 163 బి.ఎన్.ఎస్.ఎస్. సెక్షన్ ను పోలీసులు అమలు చేశారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచేలా ఆదేశాలు ఇది వరకే జారీ చేశారు.

పరీక్ష సమయానికి అనుకూలంగా టి.జి.ఎస్.ఆర్.టి.సి. అధికారులు బస్సు సౌకర్యం, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మంగళవారం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి అంజయ్య డెక్ సభ్యులతో కలిసి పరీక్షా కేంద్రాలను, ఏర్పాట్లను పరిశీలించారు.