25 February, 2026 | 12:50 PM

క్రీడల్లో సత్తా చాటిన పోలీసులు

25-02-2026 12:00 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): సైబరాబాద్ కమిషనరేట్ ఆధ్వ ర్యంలో నిర్వహించిన నాల్గవ తెలంగాణ పోలీ స్ స్పోరట్స్ అండ్ గేమ్స్ పోటీల్లో  జిల్లాకు చెందిన పోలీసు సిబ్బంది విశేష ప్రతిభ కనబరచి పలు పతకాలు సాధించారు. రాష్ట్ర స్థాయి లో జరిగిన ఈ క్రీడల్లో వివిధ విభాగాల్లో పా ల్గొన్న పోలీసులు ఉత్తమ ప్రదర్శనతో జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చారు.

వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన పొట్ట గోపి, కిరణ్ కుమార్, రాజేష్, సువార్త, పూల్ సింగ్, ఎస్. వినయ్ కుమార్లను మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నితిక పంత్ ప్రత్యేకంగా అభినందించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ రాణించడం పోలీసు సిబ్బందికి గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని జిల్లాకు మరింత ఖ్యాతి తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు. పోలీసు సిబ్బంది క్రీడా ప్రతిభను ప్రోత్సహించడంలో జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సహ కారం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ అడ్మిన్ వామన మూర్తి, ఆర్‌ఐ స్పెషల్ పార్టీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.