10-07-2025 09:03:44 PM
మేడిపల్లి (విజయక్రాంతి): పీర్జాదిగూడ మున్సిపాలిటీ(Peerzadiguda Municipality) బుద్ధనగర్ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ అమర్ సింగ్, ఆలయ కమిటీ చైర్మన్ అనిల్ సింగ్, జనరల్ సెక్రెటరీ బొందుగుల కృష్ణారెడ్డి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శ్రీ సాయినాధుని ఆశీస్సులు ప్రజల అందరిపై ఉండాలని వేడుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు నవీన్ రెడ్డి ,పద్మా రెడ్డి, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.