10-07-2025 08:47:49 PM
చివ్వేంల (విజయక్రాంతి): మండల పరిధిలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వివేక ఫౌండేషన్(Viveka Foundation) ఆధ్వర్యంలో సామాజిక సేవా నిర్వహించడం జరిగింది. ఫౌండేషన్ చైర్మన్ తికుళ్ల సాయిరెడ్డి మాట్లాడుతూ.. వేదవ్యాసమహర్షి జన్మదినం సందర్భంగా ఘనంగా గురుపూజోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలకు పది కుర్చీలు, విద్యార్థులకు పెన్నులు, పెన్సిల్స్ అందజేయడం జరిగింది. యం.ఇ.ఓ. కళారాణి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తూ గురుపూర్ణిమ రోజున గురువులకు సన్మానం చేయడం హర్షదాయకం అంటూ వివేక ఫౌండేషన్ వ్యవస్థాపకులు తికుళ్ళ సాయి రెడ్డిని అభినందించారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శైలజ,యామ రమేష్, నిమ్మల నిర్మల, నాగలక్ష్మి, రజితారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.