calender_icon.png 11 July, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల తరగతి వారి సామర్ధ్యాల పెంపుకు కృషి చేయాలి

10-07-2025 08:23:52 PM

సదాశివపేట (విజయక్రాంతి): గురువారం సదాశివపేట పట్టణంలో గల సిద్దాపూర్ కాలనీలోని ప్రాథమిక పాఠశాల తెలుగు మీడియం, ఉర్దూ మీడియం పాఠశాలలను, ఆకస్మికంగా సందర్శించడం జరిగిందని మండల విద్యాధికారి ఎన్.శంకర్(Mandal Education Officer N. Shankar) తెలిపారు. సిద్దాపూర్ కాలనీలోని తెలుగు, ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యార్థులకు టీచర్స్ బోధించే పద్ధతి వారు ఉపయోగించిన టి.ఎల్.ఎం పరిశీలించి విద్యార్థుల యొక్క తరగతి వారి సామర్థ్యాలను పెంచే విధంగా టీచర్స్ కృషి చేయాలని  విద్యార్థులకు వడ్డించిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించడం జరిగిందని ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండెవారు, వండేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యార్థులకు రుచికరమైన భోజనం వడ్డించాలని అయన అన్నారు.