calender_icon.png 11 July, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు బూట్లు, సాక్సులు అందజేత

10-07-2025 08:21:49 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): బూర్గంపాడు మండలం అంజనాపురం ఎంపీపీఎస్ పాఠశాలలోని 65 మంది విద్యార్థిని విద్యార్థులకు ఎన్నారై తేజావత్ జానకి రామ్ సుమారు రూ.15,000 విలువగల పాదరక్షకులు(షూస్), సాక్సులను గురువారం వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంఈఓ యదు సింహరాజు(MEO Yadu Simharaju) పాల్గొని మాట్లాడుతూ.. జిల్లాలోనే అంజనాపురం ఎంపీపీఎస్ ఉత్తమ పాఠశాలగా పేరుందన్నారు. జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారి నుంచి ఉత్తమ ప్రశంసలు అందుకున్న పాఠశాల అని, అలాంటి పాఠశాలకు సహాయం అందించడం మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం టి.కిషన్ రావు, ఉపాధ్యాయులు,గ్రామస్తులు పాల్గొన్నారు.