10-07-2025 08:17:30 PM
సాయి సంకీర్తనలతో ఘనంగా పల్లకీ సేవ..
మణుగూరు (విజయక్రాంతి): పట్టణంలోని సాయిబాబా దేవాలయంలో గురుపౌర్ణమి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు బాబా ఆలయానికి పోటెత్తారు. వివిధ రకాల పూలతో బాబా మందిరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా మూలవిరాట్టు షిరిడి సాయి విగ్రహానికి, దత్తాత్రేయ స్వామికి, స్వహస్తాలతో భక్తులు క్షీరాభిషేకం నిర్వహించారు. ఉదయం 5-15 గంటలకు కాగడ హారతి, 6 నుండి 8 గంటల వరకు సాయినాథుడికి భక్తులచే 108 కలశాలతో పంచామృత అభిషేకములు, అలంకరణ, అష్టోత్తర శతనామావళి, హారతి, దర్శనములు, అలంకరణ విశేష పూజ, సాయినామ సంకీర్తన కార్యక్రమం జరిగింది.
తదుపరి మధ్యాహ్న హారతి, నైవేధ్యం, తీర్థప్రసాద వితరణ జరి గింది. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 2 వేల మందికి మహా అన్న ప్రసాద విత రణ నిర్వహించారు. సాయంత్రం బాబాకి మల్లెపూల పుష్పాలతో పూజ, పల్లకి సేవ, సాయి నామ సంకీర్తనలను అర్చకులు సతీష్ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. స్వామివారి నామ స్మరణతో ఆలయం అంతా మారుమోగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ లయ కమిటీ ఏర్పాట్ల ను చేసింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.