calender_icon.png 11 July, 2025 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టు ఇచ్చిన గడువుకు ముందే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి

10-07-2025 08:14:33 PM

మునగాల: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను-2025 సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలన్న తెలంగాణ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, ఈ తీర్పు బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఎటువంటి అడ్డంకి కాదని, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అంశంపై చర్యలు తీసుకునేందుకు తగిన సమయం లభించిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా(Suryapet District) అధ్యక్షుడు పొనుగోటి రంగా ఒక ప్రకటనలో తెలిపారు. 

కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వే షన్ లను 42% పెంచడానికి నెల రోజుల సమయం సరిపోతుందని, బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచకుండా ఎన్నికలకు వెళితే బీసీలు ఎట్టి పరిస్థితుల్లో సహించరని, పార్టీ పరంగా 42 శాతం టికెట్లు ఇస్తామని ప్రకటిస్తున్నారనీ ఇలా వివాదాస్పదమైన ప్రకటనలు జారీ చేయడం ఎంతవరకు సమంజసం అని ఆన్నారు. స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందనీ, ఇప్పటికైనా బీసీల విషయంలో రాజకీయాలు చేయకుండా చిత్తశుద్ధితో రేపటి నుండే రిజర్వేషన్ల పెంపుపై కార్యాచరణ మొదలు పెట్టా లని ఆయన డిమాండ్ చేశారు.