10-07-2025 08:32:11 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ..
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): దైవచింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ(BRS leader Shambipur Krishna) అన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోనీ వివిధ ప్రాంతాలలో సాయిబాబా ఆలయాల్లో జరిగిన గురు పౌర్ణమి వేడుకల కార్యక్రమాలలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, నిజాంపేట్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగనాయప్రసాద్, మాజీ కార్పొరేటర్ సుజాత, నాయకులు బొబ్బ శ్రీనివాస్, ఏనుగుల రాజశేఖర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, అజయ్ వర్మ, శ్రీశైలం యాదవ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.