calender_icon.png 10 December, 2025 | 6:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాతవాహన విశ్వవిద్యాలయానికి ప్రత్యేకంగా 500 కోట్లను కేటాయించాలి

10-12-2025 05:00:42 PM

ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్

ముకరంపుర (విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయానికి ప్రత్యేకంగా 500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్ ఒక ప్రకటనలో కోరారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 1000 కోట్లను కేటాయిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీవో విడుదల చేయడాన్ని హర్షిస్తున్నామని, అలాగే శాతవాహన విశ్వవిద్యాలయానికి 500 కోట్లను కేటాయించాలి కోరారు.