calender_icon.png 2 December, 2025 | 1:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అరెస్టుల పరంపర

02-12-2025 12:34:03 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లాలో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. మంగళవారం పాల్వంచలో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి హాజరుకానున్న విషయం విధితమే. నేపథ్యంలో ఉద్యమకారులను, పాత్రికేయ సంఘం నాయకులను, ప్రతిపక్ష నేతలను పోలీసులు ముందస్తుగానే అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. కొత్తగూడెంలో ఐజేయు జిల్లా అధ్యక్షులు ఇమంది ఉదయ్ కుమార్ ను, పాల్వంచ పట్టణంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి పోలిశెట్టి వెంకటేశ్వర్లు, తెలంగాణ ఉద్యమకారులు రషీద్ తదితరులను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్ తరలించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ప్రశ్నిస్తున్నారనే అక్కస్సుతో నిర్బంధాన్ని కొనసాగిస్తున్నట్లు వారు ఆరోపించారు. తక్షణమే అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని, ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో పాత్రికేయులకు, తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులను వారంతా ముక్తకంఠంతో ఖండించారు.