02-12-2025 01:17:24 PM
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో(United state) తెలంగాణకు చాలా నష్టం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) గుర్తుచేశారు. బీఆర్ఎస్ పాలనలో(BRS rule) రాష్ట్రాన్ని అప్పల పాలు చేసిందని కోమటిరెడ్డి ఆరోపించారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చాకే పరిపాలన గాడిలో పడిందని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో డీసీసీ అధ్యక్షులు కష్టపడి పనిచేయాలని కోమటి రెడ్డి సూచించారు.
ఏపీ డిప్యూటీ సీఎంపై తెలంగాణ మంత్రి ఆగ్రహం
ఇటీవల తెలంగాణ నాయకులపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కోనసీమకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందనే వ్యాఖ్యలు బాధకరమన్నారు. తెలంగాణ ప్రజల దిష్టి కాదు.. ఆంధ్రా పాలకుల వల్ల తెలంగాణలోని ప్రజలు ఫ్లోరైడ్ విషం తాగారని మండిపడ్డారు. చిరంజీవి సూపర్ స్టార్(Chiranjeevi Super Star), ఆయన మంచోడన్న మంత్రి కోమటిరెడ్డి రాజకీయ అనుభవం లేకనే పవన్ ఇలా మాట్లాడుతున్నారని వెల్లడించారు. తెలంగాణ ప్రజలను అవమానిస్తే ఊరుకోమని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చేప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే తెలంగాణలో పవన్ సినిమాలు ఆడనివ్వబోమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.