03-05-2025 11:32:19 PM
హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు...
వివరాలు వెల్లడించిన మల్టిజోన్ ఐజి సత్యనారాయణ..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ఈ నెల 10వ తేదీన మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న 22 మంది దేశ విదేశాల నుంచి విచ్చేయుచున్న సుందరిమణులు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి విచ్చేస్తున్నట్లు మల్టిజోన్ ఐజి సత్యనారాయణ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి దగ్గర ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో ఈ నెల 10వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా, ఈ నెల 16వ తారీఖు సాయంత్రం 5:00 నుండి 7:00 గంటల వరకు మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనే 22 మంది వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రసిద్ధ పిల్లలమర్రి మహావృక్షాన్ని సందర్శించనున్నారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఐజి మాట్లాడుతూ... ఈ సందర్శనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని మూడు స్థాయిల భద్రతను ఏర్పాటు చేస్తామన్నారు. సుమారు వెయ్యి మంది పోలీసు సిబ్బందితో ఈ భద్రత చేపట్టడం జరుగుతుందని, హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ వరకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా అధికారులు పర్యవేక్షణ చేపడతామన్నారు. ఈ సందర్భంగా పిల్లలమర్రిలో నిర్వహించబోయే బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి, అవసరమైన సూచనలు డి ఐ జి, ఎస్పీలకు తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా బద్ధబస్తు ఉండాలని సూచించారు. నిర్లక్ష్యం అనే మాటకు తావు లేకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డి ఐ జి ఎల్.ఎస్. చౌహాన్, జిల్లా ఎస్పీ డి. జానకి, ఐ, డీఎస్పీ వెంకటేశ్వర్లు, రూరల్ సీఐ గాంధీ నాయక్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భగవంత్ రెడ్డి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.