calender_icon.png 24 February, 2026 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సురక్షిత ప్రయాణానికి ‘అరైవ్ అలైవ్’

24-02-2026 12:12:43 AM

గట్టు, ఫిబ్రవరి 23: రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రతి ఒక్కరు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఉద్దేశంతో అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్త్స్ర శేఖర్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు సోమవారం గట్టు మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో తెలంగాణ పోలీస్ శాఖ  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో భాగంగా  బైకు ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ట్రాఫిక్ నిబంధనలు నిర్లక్ష్యం చేయడమేనని అన్నారు. ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రతా నియమాలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలను చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది వాహనదారులు పాల్గొన్నారు.