24-02-2026 12:12:50 AM
కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్
సూర్యాపేట, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): ప్రజావాణి పిర్యాదులను అధికారులు తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో ఆయన పాల్గొని ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, వివిధ శాఖలలో చాలా కాలం పెండింగ్‌లో ఉన్న పిర్యాదులపై శాఖల వారీగా ప్రత్యేక శ్రద్ద పెట్టి పరిష్కరించాలన్నారు.
అలాగే రాష్ట్ర స్థాయి ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను కూడా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో భూ సమస్యలకి సంబందించి 48 దరఖాస్తులు,జిల్లా పంచాయతీ అధికారి 8, వైద్య ఆరోగ్య శాఖ అధికారి 7, డి ఆర్ డి ఓ 6 మిగిలిన 30 దరఖాస్తులు వివిధ శాఖలకి చెందినవని, మొత్తం 99 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కే. సీతారామారావు , మహిళా, శిశు సంక్షేమ అధికారి కే.నర్సింహారావు,,డి ఎస్ సి డి ఓ కే. దయానంద రాణి తదితరులు పాల్గొన్నారు.