calender_icon.png 10 November, 2025 | 3:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

"అరుణాచల్‌"లో చైనా కబ్జా !

13-09-2024 04:33:32 PM

ఇటానగర్: "అరుణాచల్‌"ప్రదేశ్‌ తమదే అంటూ తరచూ కయ్యానికి దిగే చైనా.. ఇటీవల ఏకంగా ఆ రాష్ట్రంలోకి అడుగుపెట్టినట్లుగా కూడా తెలుస్తోంది. డ్రాగన్‌ సైన్యం అరుణాచల్‌లోని అంజా జిల్లాలో 60 కిలోమీటర్ల మేర లోపలకు వచ్చినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. కపాపు ప్రాంతంలో కొద్ది రోజుల పాటు మకాం వేసినట్లుగానూ అందులో పేర్కొన్నారు. చైనా సైన్యం మంటలు వేసినట్లు, రాళ్లపై స్ర్పే చేసినట్లు, ఆహారం తిన్నట్లుగా కొన్ని వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. భారత రక్షణ శాఖ ఈ కథనాలను ఖండించింది. సరిహద్దుల్లో గుర్తించని ప్రాంతాల్లో భారత్‌-చైనా దళాలు పహారా కాస్తాయని, రాళ్లపై చైనా దళాలు వేసినది తాత్కాలిక మార్కింగేనని, ఆక్రమణకు దిగినట్లు కాదని పేర్కొన్నారు.