calender_icon.png 5 February, 2026 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిరు తనయగా..

05-02-2026 01:29:40 AM

‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాతో చిరంజీవి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తర్వాత వేసవిలో ఆయన నటించిన మరో చిత్రం ‘విశ్వంభర’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, దర్శకుడు బాబీతో మెగాస్టార్ తన 158వ సినిమా చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

‘మెగా158’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలింనగర్ సర్కిళ్లలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో చిరంజీవి కుమార్తెగా ఒక కీలక పాత్ర కోసం ‘ధురంధర్’ ఫేమ్ సారా అర్జున్‌ను టీమ్ తీసుకోనున్నట్టు సమాచారం.

ఈ బ్యూటీనే టీమ్ దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సారా నటించే పాత్ర సినిమాలో అత్యంత కీలకం కానుందట. ఈ విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాక్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్‌లో ఇదొక ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుందని మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.