23 June, 2026 | 3:04 AM

బాధితులకు భరోసాగా ఉంటాం

23-06-2026 01:42 AM

నిర్మల్ జూన్ 22 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రజలకు ఏ అవసరమొచ్చి నా పోలీస్ శాఖ స్పందిస్తుందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో పోలీస్ ప్రజావాణి నిర్వహించి ప్రజల అర్జీలను స్వీకరించారు. కుటుంబ సమస్యలతో పాటు ఇతర సమస్యలను ఎదుర్కొంటున్న వారు పోలీసులను ఆశ్రయిస్తే పోలీస్ శాఖ ద్వారా ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసులు పాల్గొన్నారు.