13 July, 2026 | 8:19 AM

విజయ్ ప్రియురాలిగా..

12-12-2024 12:00 AM

హీరోయిన్ రుక్మిణి వసంత్ పేరు ప్రస్తుతం టాలీవుడ్‌లో బాగా వినిపిస్తోంది. ‘నా సముద్రానివి నువ్వు’ అంటూ ‘సప్త సాగరాలు దాటి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రుక్మిణి ఇప్పుడు వరుస అవకాశాలతో జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం రుక్మిణి వసంత్.. ‘ఏసీఈ’ చిత్రంతో తమిళంలోనూ అడుగు పెడుతున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన రుక్మిణి వసంత్ నటిస్తున్నారు. ఆరుముగ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలోని పాత్రను తాజాగా పరిచయం చేశారు. ఈ చిత్రంలో విజయ్ ప్రియురాలిగా రుక్మిణి వసంత్ నటిస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా రుక్మిణి వసంత్ నటించే చిత్రాలన్నీ స్టార్ హీరోల సరసన చేస్తున్నవే కావడం గమనార్హం. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న కాంతార చాప్టర్ 1తో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబోలోనూ రుక్మిణి వసంత్ నటిస్తున్నారు. అలాగే ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ చేయనున్న చిత్రంలోనూ రుక్మిణి వసంత్ నటిస్తున్నారు. మొత్తానికి రుక్మిణి వసంత్ క్షణం తీరిక లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు.