13 July, 2026 | 7:25 AM

భావోద్వేగాల కలయికగా దండోరా

12-12-2024 12:00 AM

మురళీకాంత్ దర్శకత్వంలో లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్న చిత్రం ‘దండోరా’. ఈ సినిమా బుధవారం రామనాయుడు స్టూడియోలో  పూజా కార్యక్రమాలను లాంఛనంగా పూర్తి చేసుకుంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సాహు గారపాటి క్లాప్ కొట్టగా.. బేబీ నిర్మాత ఎస్ కే ఎన్ కెమెరా స్వి ఆన్ చేయగా..  ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గౌరవ దర్శకత్వం వహించారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో ‘దండోరా’ సినిమాను రూపొందించనున్నారు. మన పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే వ్యంగ్యం, చక్కటి హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా ఈ సినిమా తెరకెక్కనుంది. విలక్షణ నటుడు శివాజీతో పాటు నవదీప్, రాహుల్ రామకృష్ణ, రవికృష్ణ, మనీక చిక్కాల, అనూష తదితరులు ప్రధాన పాత్రలతో మెప్పించనున్నారు. ఈ చిత్రానికి మార్క్ కె. రాబిన్ సంగీతం అందించనున్నారు.