8 July, 2026 | 7:53 PM

Breaking News

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •   ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం   •   ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్–టాస్క్ శిక్షణ ముగింపు   •   బాన్సువాడలోని ఆదిత్య స్కూల్ పై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు   •   బిఆర్ఎస్ కు షాక్ .....   •   ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •  

అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన ఆశా కార్యకర్తలు

25-03-2025 06:27 PM

కాటారం (విజయక్రాంతి): ఆశా కార్యకర్తలకు జీతాల పెంపు తదితర అంశాల పట్ల ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాల మేరకు హామీలు అమలు చేయకపోవడం పట్ల నిరసన తెలియజేస్తూ ఆశా కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రమైన గారేపల్లిలో గల అంబేద్కర్ విగ్రహానికి ఆశా కార్యకర్తలు వినతిపత్రం అందజేశారు. మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. హైదరాబాదులో ఆశా కార్యకర్తలు చేస్తున్న కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేయడానికి పోలీసులతో దాడులు చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన పిలుపుమేరకు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆశా కార్యకర్తలకు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 18 వేల రూపాయల జీతాన్ని అందజేస్తామని, ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి, సీఎం రేవంత్ రెడ్డి హయాంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట ఇచ్చి మరిచిందని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రమేష్, రవి, ఆశా కార్యకర్తలు కే రాజేశ్వరి, జయప్రద, బి పద్మ, ఎం రమాదేవి, ఏ లత, జె సమ్మక్క, సరూప రాణి, కె లక్ష్మి, టీ నాగమణి, బి స్వరూప, ఏం వసంత, పి స్వరూప, బి శైలజ, పార్వతి, కాంతా, జ్యోతి, లక్ష్మి, శారద తదితరులు పాల్గొన్నారు.