17-09-2025 02:42:06 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వసిద్ధం చేశామని, సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమ వుతోందని ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్ తెలిపారు. మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం లో నోడల్ అధికారులతో ఉన్నతస్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు.
జూబ్లీహిల్స్ ఓటర్లు ఎన్నికల విధుల్లో పాలుపంచు కోకుండా చూడాలని స్పష్టం చేశారు. ఓటర్లలో చైత న్యం పెంచేందుకు ఈవీఎం, వీవీ ప్యాట్లను విస్తృతంగా వినియోగించాలని, అన్ని పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, ర్యాంపు లు, మరుగుదొడ్లు సదుపాయాలు ఉండేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో జో నల్ కమిషనర్లు అనురాగ్ జయంతి, అపూర్వ్ చౌహాన్, శ్రీనివాస్‌రెడ్డి, అదనపు కమిషనర్లు మంగతాయారు, పాల్గొన్నారు.
ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచండి
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేపట్టిన వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం ఎస్‌ఎన్‌డిపి, ఇతర ఇంజనీరింగ్ ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచి, వాటిని త్వరగా పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జోనల్ కమిషనర్లు, ప్రాజెక్టు ఇంజనీర్లు, ప్లానింగ్ , భూసేకరణ అధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇంజనీరింగ్ అధికారులు పవర్పాయింట్ ప్రెజెంటేషన్ల ద్వారా ఒక్కో ప్రాజెక్టు పురోగతిని, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సవాళ్ల ను, పనులు పెండింగ్లో ఉండటానికి గల కారణాలను కమిషనర్‌కు వివరించారు. అధికా రులు లేవనెత్తిన అంశాలపై స్పందించిన కమిషనర్ ఆర్.వి. కర్ణన్, పనుల పూర్తికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టుల పూ ర్తికి ప్రభుత్వం వద్ద నిధుల కొరత లేదు. అధికారులు సమన్వయంతో పనిచేసి పనుల్లో వేగం పెంచాలి,అని ఆయన స్పష్టం చేశారు.
రోడ్డు విస్తరణ త్వరగా పూర్తి చేయాలి
లింగంపల్లి చౌరస్తా నుంచి అమీన్‌పూర్ మీదుగా సుల్తాన్ పూర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ వరకు రోడ్డు విస్తరణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ కర్ణన్ ఇంజనీర్లను ఆదేశించారు. లింగంపల్లి, అమీన్‌పూర్, సుల్తాన్‌పూర్ రోడ్డు విస్తరణ పనులను కమిషనర్ ఆర్‌వి కర్ణన్, మెదక్ ఎంపీ రఘునందన్‌రావుతో కలిసి మంగళవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నాలాపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టి హైవేకు కనెక్ట్ చేస్తే ప్రయాణికులకు సౌలభ్యంగా ఉంటుందనీ ఎంపీ రఘునందన్ రావు కమిషనర్‌ను కోరారు.