23-12-2025 04:24:01 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు సర్వే డబ్బులు ఇవ్వాలని పెండింగ్ వేతనాలు చెల్లించాలని అన్నిపీఏసీల ముందు ఆశ వర్కర్ల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. పట్టణంలోని రామ్ నగర్ బంగాల్పేట్ వెలుమల బొప్పారం బుజ్జి తదితర గ్రామాల్లో ధర్నా చేసిన ఆశ వర్కర్లు తమ డిమాండ్లను అధికారులు వెంటనే పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు సురేష్ కుమార్ చంద్రకళ ఇంద్రమాల గంగామణి నాగమణి తదితరులు ఉన్నారు.