23-12-2025 05:38:14 PM
నంగునూరు: పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పాలమాకుల, బద్దిపడగ, గట్లమల్యాల, తిమ్మయపల్లి, మాగ్ధూంపూర్ గ్రామాల్లో పశువైద్య అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వం జీవాల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తోందని,గొర్రెలు, మేకలలో వచ్చే అంతర్గత పరాన్నజీవుల నిర్మూలనకు ఈ నట్టల నివారణ మందులు ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, పశుసంవర్ధక శాఖ సిబ్బంది,పెద్ద సంఖ్యలో పెంపకందారులు తదితరులు పాల్గొన్నారు.