calender_icon.png 23 December, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సెంట్ ఫాల్స్ హై స్కూల్ క్రిస్మస్ వేడుకలు

23-12-2025 05:46:05 PM

జడ్చర్ల: పట్టణంలోని సాయి నగర్ కాలనీలో సెంట్  ఫాల్స్ హైస్కూల్ మంగళవారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందస్తుగా విద్యార్థులకు సెలువు ఉండడంతో ముందస్తుగానే పాఠశాలలో విద్యార్థులతో క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన చైర్మన్ కె.సిల్వా రెడ్డి,  పాస్టర్ కే.రాజారెడ్డి కరస్పాండెంట్ కె మర్రేటి ప్రిన్సిపాల్ బాలకిషోర్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు.

క్రిస్మస్ కేక్ కట్ చేసి అనంతరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత పాఠశాల యజమాన్యం అతిథులకు శాలువా కమిటీ మెమోటోలతో సత్కరించారు. విద్యార్థులకు క్రీస్తు సందేశం వినిపించారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనాలు. చిన్నారి విద్యార్థుల నృత్యాలు అందర్నీ అలరించాయి. విద్యార్థులు మహోవా జన్మ వృత్తాంతమును కళ్లకు కట్టినట్టుగా ప్రదర్శించిన దృశ్య రూపకం అందర్నీ ఆకట్టుకుంది. ఏసుక్రీస్తు ను విద్యార్థుల బృందం పాడిన పాటలు ఉర్రూతలు ఊగించాయి. క్లాస్ విద్యార్థులకు బహుమతులు అందజేశారుఅందజేశారు.