calender_icon.png 23 December, 2025 | 7:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాప్రతినిధులను సన్మానించిన ఎమ్మెల్యే

23-12-2025 05:53:19 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): రెబ్బెన మండలం తక్కలపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన సర్పంచ్ దడ్డి సగుణ, ఉపసర్పంచ్ పుప్పాల శంకరయ్యతో పాటు వార్డ్ సభ్యులు గురువారం  ఎమ్మెల్యే  కోవ లక్ష్మి  నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన ప్రజాప్రతినిధులను శాలువాలతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో  నాయకులు సంఘం శ్రీనివాస్, దాసరి మల్లయ్య, సురేష్, పెద్దింటి హరీష్, మహేందర్, మేడి బాపు,పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.