23-12-2025 06:05:08 PM
18 గ్రామాల కాంగ్రెస్ సర్పంచులకు సన్మానం
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని 18 గ్రామాల కాంగ్రెస్ పార్టీ సర్పంచులకు, ఉపసర్పంచులకు,వార్డు మెంబర్లకు నాగిరెడ్డిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా శాలువులతో సన్మానించడం జరిగిందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్,ప్రధాన కార్యదర్శి దివిటి కిష్టయ్య,సీనియర్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి గ్రామంలోని ప్రతి గడపగడపకు వెళ్లాలని తెలిపారు.
అలాగే గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని గ్రామాలను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లి తీర్చిదిద్దాలన్నారు.గ్రామాల్లో ఎలాంటి ఒడిదడుగులు ఏర్పడిన తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు పని చేయకూడదని అన్నారు.గ్రామంలో ఎవరైనా తమ సమస్య గురించి వస్తే సంపూర్ణంగా స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. గ్రామంలో ప్రతి సమస్యపై స్పందించి పరిష్కరించి ప్రజలకు మేలు చేయాలన్నారు. గ్రామాల్లో విద్య, వైద్యం, త్రాగునీరు, మురికి కాల్వలు,వీధి దీపాలు,పారిశుధ్య పనులు, రహదారులు, చెరువుల అభివృద్ధి మౌలిక సదుపాయాల అంశాలపై దృష్టి సాధించాలన్నారు. గ్రామాల్లో పాలకవర్గం ఐక్యమత్యంతో అన్ని అంగుళాలతో గ్రామాల అభివృద్ధిదేంగా పనిచేయాలన్నారు.