23-12-2025 04:28:11 PM
‘100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ’ పేరుతో వినూత్న పోటీలు
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా యువజన, క్రీడల మరియు టూరిజం శాఖ ఆధ్వర్యంలో, జిల్లా టూరిజం అధికారి బి. శ్రీకాంత్ రెడ్డి సమన్వయంతో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎల్. కిషోర్ కుమార్, ఇతర జిల్లా ఉన్నతాధికారుల చేతుల మీదుగా “100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ” కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎల్. కిషోర్ కుమార్ మాట్లాడుతూ... రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన కానీ ప్రజలకు పెద్దగా తెలియని పర్యాటక ప్రాంతాలను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. రాష్ట్ర ప్రజలకు అంకితంగా నిర్వహిస్తున్న ఈ వినూత్న కార్యక్రమంలో పాల్గొనాలని యువతను ఆయన ఆహ్వానించారు. పదవిభాగంలో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయున్నట్టు జెసి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు జనవరి 5, 2026లోపు తమ ఎంట్రీలను పంపవలసి ఉంటుందని, ఈ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా విజేతలను ప్రకటిస్తామని తెలిపారు