26 February, 2026 | 4:10 PM

విద్యార్థులకు అండగా ‘అశోక చక్రవర్తి ఫౌండేషన్’

26-02-2026 12:53 AM

నూతనకల్, ఫిబ్రవరి 25: విద్యార్థులు ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి, ఉత్తమ ఫలితాలను సాధించాలని అశోక చక్రవర్తి ఫౌండేషన్ అధ్యక్షుడు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పసుల అశోక్ యాదవ్ ఆకాంక్షించారు. మండల పరిధిలోని ఎర్రపహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అశోక చక్రవర్తి ఫౌండేషన్ అధ్యక్షుడు పసుల శైలజ - అశోక్ యాదవ్ దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, పాఠశాలలోని 62 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు మరియు పెన్నులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా అశోక్ యాదవ్ మాట్లాడుతూ.. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులై పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు అందించడమే కాకుండా, పరీక్షల సమయాల్లో రవాణా సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముత్తయ్య, ఉపాధ్యాయ బృందం, గ్రామ ఉపసర్పంచ్ మంగళపల్లి నారాయణ, మాజీ సర్పంచ్ గుర్రం సత్యనారాయణ, గ్రామ పెద్దలు లింగాల రామచంద్రయ్య, పసుల లింగయ్య, వార్డు సభ్యులు చిర్ర శ్రీనాథ్, పసుల యాదగిరి, పసుల సుధాకర్, మొండికత్తి ఎల్లయ్య, జలగం గౌతమ్ మరియు యువ నాయకులు మద్దెల మధు, అనంతల విజయ్, వల్లపు మధుసుదన్ తదితరులు పాల్గొన్నారు.