calender_icon.png 16 June, 2025 | 11:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అశోక వన్ మాల్ ఐడీఎల్ 5కె అండ్ 10కె రన్

16-06-2025 02:30:34 AM

  1. వేల మంది రన్నర్లతో సందడిగా సాగిన పరుగు 
  2. ఆరోగ్యం, సమాజ బంధాలకు వేదికైన కార్యక్రమం

హైదరాబాద్, సిటి బ్యూరో జూన్ 15 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో ఫిట్‌నెస్ సందడిని సృష్టిస్తూ అశోక వన్ మాల్, తమ క్రీడా భాగస్వామి డెకాథ్లాన్‌తో కలిసి ఐడీఎల్ 5కె ,10కె రన్‌ను దిగ్విజయంగా నిర్వ హించింది. ఆరోగ్యం, సమాజ బంధాలు, క్రీడాస్ఫూర్తిని చాటుతూ జరిగిన ఈ పరుగులో అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మాల్ ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ రన్, సమీపంలోని ఆహ్లాదకరమైన సరస్సు పక్కన ఉన్న రోడ్డు మీదు గా సాగి, తిరిగి మాల్ వద్దే ముగిసింది.

అమెచ్యూర్ రన్నర్లు, అనుభవజ్ఞులైన అథ్లెట్లు, కార్పొరేట్ జట్లు, ఫిట్‌నెస్ ప్రేమికులు.. ఇలా విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 5కె రన్‌లో పురుషుల విభాగంలో మొహమ్మద్ షరీఫ్, మహిళల విభాగంలో అంజలి మొదటి స్థానంలో నిలిచి డెకాథ్లాన్ షూలను బహుమతిగా అందుకున్నారు.

మనోజ్, సౌజన్య తమ తమ విభాగాల్లో రెండో స్థానం సాధించి డెకాథ్లాన్ టీ-షర్టులు సొంతం చేసుకున్నారు. పరుగులో పాల్గొన్న వారందరికీ రిఫ్రెష్‌మెంట్లు అందించారు. ఈ సందర్భంగా అశోక డెవలపర్స్ అండ్ బిల్డర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ జైదీప్ రెడ్డి మాట్లాడుతూ, ‘ఐడీఎల్ 5కె అండ్ 10కె రన్ అనేది ఆరోగ్య ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పే కార్యక్రమమని అభిప్రాయపడ్డారు. ఫిట్‌నెస్ కోసం ఇంత మంది వ్యక్తులు కలిసి రావడం నిజంగా స్ఫూర్తిదాయకని కొనియాడారు.