16-10-2025 06:25:31 PM
అశ్వాపురం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొదెం వీరయ్య అధ్యక్షతన, స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సారథ్యంలో గురువారం మణుగూరు పట్టణంలో డిసిసి అధ్యక్షుల దరఖాస్తుల సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఏఐసీసీ పరిశీలకుడైన జాన్సన్ అబ్రహం విచ్చేశారు. ఈ సందర్భంగా అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
కార్యక్రమంలో మాట్లాడిన జాన్సన్ అబ్రహం మాట్లాడుతూ ఇది కేవలం పరిపాలనా ప్రక్రియ కాదు, ఇది రాజకీయ, సిద్ధాంతపరమైన ఉద్యమం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ్ యాత్రల ఆత్మను కొనసాగించే ప్రయత్నం ఇది. ఈ యాత్రలు న్యాయం, సమానత్వం, లౌకికత అనే కాంగ్రెస్ సిద్ధాంతాలను మరింత బలంగా ప్రజలకు చాటాయి,” అని అన్నారు.పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త బూత్ లెవల్ నుంచి సమష్టిగా కృషి చేసి, రాబోయే ఎన్నికల్లో మండలంలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య, సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి, తూము పెద్ద రాఘవులు, బేతం రామకృష్ణ, బట్టా సత్యనారాయణ, కాక రాములు, బచ్చు వెంకటరమణ, బారాజు సంపత్, చెంచాల రాము, మచ్చ నరసింహారావు, మానాది సైదులు, కుంజ జాను, కాళిదాస్ తదితరులు పాల్గొన్నారు.