16-10-2025 08:33:23 PM
కడ్తాల్: స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు ఈనెల 18న రాష్ట్ర బంద్ ను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని కడ్తాల్ రాష్ట్ర బంద్ ను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని కడ్తల్ మండల అధ్యక్షులు పిప్పళ్ల వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల రాఘవేందర్ లు పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం బీసీల హక్కులను కాలరాయడమే అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
రాజ్యాంగం ఇచ్చిన హక్కులను హరించే ఈ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అప్పిల్ వేసి బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.బీసీ వర్గాలు ఈ రాష్ట్ర నిర్మాణంలో, అభివృద్ధిలో, రాజకీయ, సామాజిక రంగాల్లో అగ్రగామిగా ఉన్నా సరైన గుర్తింపు ఇప్పటికీ దక్కడం లేదన్నారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో రిజర్వేషన్లను తగ్గించడం బీసీ సమాజాన్ని వెనక్కు నెట్టే కుట్ర అని అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలకు మద్దతుగా ఈ నెల 18వ తేదీన రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని కడ్తాల్ మండలంలోని ప్రజలందరికీ పిలుపునిచ్చారు. బీసీల హక్కులను కాపాడటానికి అన్ని బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంస్థలు, రాజకీయ పార్టీలు ఒకే వేదికపైకి రావాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు బీసీల మనోభావాలను గౌరవించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం తెచ్చిన జీవో నెం.9ని 9వ షెడ్యూల్ లో చేర్చే విధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై బీసీ నేతలంతా ఒత్తిడి తీసుకురావాలని కోరారు. లేకపోతే రాసేవక్తంగా పెద్ద ఉద్యమాలను నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.