calender_icon.png 16 October, 2025 | 11:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్ఐవిపైన ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలి

16-10-2025 08:42:15 PM

వైద్య అధికారి పి.బి ఆచార్య..

నర్సంపేట (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ హెచ్ఐవి పైన అవగాహన కలిగి ఉండాలని నల్లబెల్లి వైద్య అధికారి పిబి ఆచార్య, వై ఆర్ జి కేర్ లింక్ వర్కర్ స్కీమ్ డిఆర్పి ఎండి ముస్తాక్ అన్నారు. మండల కేంద్రంలో గురువారం లింక్ వర్కర్ స్కీం ఆధ్వర్యంలో నిర్వహించిన హెచ్ఐవి పై అవగాహన ర్యాలీని వైద్య అధికారి ఆచార్య జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ అనంతరం వారు మాట్లాడుతూ హెచ్ఐవి నాలుగు మార్గాల ద్వారానే వ్యాప్తి చెందుతుంది అసురక్షిత లైంగిక సంబంధాలు, కలుషితమైన రక్తమార్పిడి, కలుషితమైన సూదులు చిరంజీలు, హెచ్ఐవి ఉన్న తల్లిదండ్రులకు పుట్టే పిల్లలకు వ్యాపిస్తుందని అన్నారు.

మరి ఏ పద్ధతుల ద్వారా హెచ్ఐవి వ్యాపించదు. హెచ్ఐవి వారిపట్ల వివక్షత చూపకుండా మనలో ఒకరిగా ఆదరించాలని కోరారు. అనంతరం మండల కేంద్రంలోని మండల సమైక్య కార్యాలయంలో నిర్వహించిన వివో మీటింగులో డిఆర్పి ముస్తాక్ మాట్లాడుతూ హెచ్ఐవి, ఎస్.టి.ఐ వ్యాప్తి, నివారణ మార్గాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వై ఆర్ జి కేర్ మిల్క్ వర్కర్ స్కీం ప్రతినిధులు సామల వీరన్న, జరుపుల లింగన్న, మురళి, స్థానిక యువకులు, గ్రామ పెద్దలు, వైద్య సిబ్బంది, అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.